మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు మద్యం షాపులు బంద్
Two days wine shops close in telangana.తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on
11 March 2021 6:45 AM GMT

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో రెండు రోజుల పాటు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసి ఉంటాయని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో శుక్రవారం (మార్చి 12) సాయంత్రం 4 నుంచి ఆదివారం (మార్చి 14) సాయంత్రం 4 గంటల వరకు మూసివేయనున్నట్టు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 17న ఉదయం నుంచి వైన్స్‌లు మూసి ఉంటాయన్నారు. ఈ నెల 14న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
Next Story