టీఎస్ఆర్టీసీ కొత్త స‌ర్వీస్‌.. ఇంటివ‌ద్ద‌కు మామిడిపండ్లు

TSRTC To Deliver Mangoes Home. ఎండీ సజ్జనార్ రాకతో తెలంగాణ ఆర్టీసీలో మునుపెన్నడూ లేనంత సందడి, ఉత్సాహం కనిపిస్తున్నాయి

By Medi Samrat  Published on  3 May 2022 6:21 PM IST
టీఎస్ఆర్టీసీ కొత్త స‌ర్వీస్‌.. ఇంటివ‌ద్ద‌కు మామిడిపండ్లు

ఎండీ సజ్జనార్ రాకతో తెలంగాణ ఆర్టీసీలో మునుపెన్నడూ లేనంత సందడి, ఉత్సాహం కనిపిస్తున్నాయి. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థను క్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాట ఎక్కించేందుకు ఆయన ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణీకుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త సర్వీసులు, ట్రిప్పులు, ఆఫ‌ర్ల‌తో ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేస్తున్నారు.

తాజాగా ఎండీ స‌జ్జ‌నార్ స‌ర్ మ‌రో స‌ర్వీసుతో ముందుకు వ‌చ్చారు. మధురమైన మామిడిపండ్లు తోట నుండి నేరుగా మీ ఇంటి వద్దకే డెలివ‌రీ చేయ‌నున్న‌ట్లు ట్విట‌ర్ వేదిక‌గా తెలిపారు. టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ ద్వారా ఈ స‌ర్వీసు అంద‌చేయ‌నున్న‌ట్లు తెలిపారు. చెమటోడ్చి ఆకలిని తీర్చే.. అన్నదాత రైతన్నను ఆదుకోండి అంటూ ప్ర‌జ‌ల‌ను ట్వీట్‌లో కోరారు. సజ్జనార్ ట్వీట్‌కు విశేష స్పంద‌న వ‌స్తోంది. బుకింగ్‌ల కోసం https://www.tsrtcparcel.in/TSCounter/Account/Productsని సందర్శించండని పేర్కొంది.











Next Story