మహిళకు టికెట్ కొట్టిన కండ‌క్ట‌ర్‌.. విచార‌ణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్.!

శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రవేశపెట్టినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళకు టికెట్‌ జారీ చేసిన బస్సు కండక్టర్‌పై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) ఆదివారం చర్య తీసుకుంది.

By Medi Samrat  Published on  10 Dec 2023 1:32 PM GMT
మహిళకు టికెట్ కొట్టిన కండ‌క్ట‌ర్‌.. విచార‌ణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్.!

శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రవేశపెట్టినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళకు టికెట్‌ జారీ చేసిన బస్సు కండక్టర్‌పై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) ఆదివారం చర్య తీసుకుంది. ఓ మహిళకు బస్సు కండక్టర్ రూ.90 టిక్కెట్‌ను జారీ చేసిన వీడియో వైరల్‌గా మారింది. నిజామాబాద్ జిల్లా బోదన్ డిపో పరిధిలో ఓ మహిళకు కండ‌క్ట‌ర్‌ టికెట్ జారీ చేయడంపై విచారణకు ఆదేశించినట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. ఎక్స్ ద్వారా తెలిపారు. సంబంధిత కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచాం. విచారణ అనంతరం అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వెళ్లే బస్సులో మొబైల్‌ ఫోన్‌లో తీసిన వీడియోలో.. ఓ వ్యక్తి బస్సు కండక్టర్‌ మహిళా ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చాడని చెబుతున్నాడు. క్లిప్‌లో బుర్కా ధరించిన మహిళ కనిపిస్తుంది. కండక్టర్ కూడా తన చర్యను సమర్థించుకోవడం కనిపిస్తుంది. ఆ మహిళ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టిక్కెట్టును బట్టి స్పష్టమైంది.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలలో ఒకదానిని అమలు చేసేందుకు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని టీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మ‌హిళ‌లు రాష్ట్ర వ్యాప్తంగా బ‌సుల‌లో ఉచితంగా ప్ర‌యాణిస్తున్నారు.

Next Story