మహేష్ బాబును వాడేసిన తెలంగాణ ఆర్టీసీ

TSRTC MD Sajjanar Uses Mahesh Babu Meme to Build Brand Image of TSRTC. సాధారణంగా మహేష్ బాబు ఎన్నో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో

By Medi Samrat  Published on  1 Nov 2021 3:11 PM IST
మహేష్ బాబును వాడేసిన తెలంగాణ ఆర్టీసీ

సాధారణంగా మహేష్ బాబు ఎన్నో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయనను వాడుకొని ఎన్నో మీమ్స్ తయారు చేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ మహేష్ బాబును వాడేసుకుంది. పెరుగుతున్న పెట్రల్ ధర పై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ మీమ్ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ పోస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బైక్ నడుపుతున్న ఫొటోలతో ఉప్పల్, జీడిమెట్ల, ఆరాంఘర్ .. తూ దీనెమ్మ జీవితం ట్యాంకులు, ట్యాంకులు పెట్రోల్ అయిపోతుంది సిటీలో తిరుగుదామంటే అని ఉంది. అందుకే బ్రదర్ లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధరకే టీఎస్ ఆర్టీసీ వారి టీఎస్24 టిక్కెట్ తో 24 గంటలు సిటీ అంత తిరుగు.. అంటూ రాసి ఉన్న ఓ మీమ్ ఫోటోను షేర్ చేశారు సజ్జనార్. ఈ ఫోటోకు తెగ పాపులారిటీ దక్కింది. మహేష్ బాబును ఇలా కూడా వాడేస్తున్నారా అని ఆయన అభిమానులు కూడా ఒకింత షాక్ అవుతున్నా.. నవ్వుకోడానికి ఫన్నీగా ఉండడంతో పలువురు షేర్ చేస్తూ వస్తున్నారు.

ఈరోజు కూడా దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌పై తొలిసారిగా 40 పైసలకు పైగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ పై 41 పైసలు, డీజిల్‌ పై 42 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ రూ.114.13, లీటర్‌ డీజిల్‌ రూ.107.40కి హైదరాబాద్‌లో లభిస్తోంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.15, డీజిల్ రూ.101.56కు లభిస్తోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.69 డీజిల్ రూ.98.42కు దొరుకుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.50, డీజిల్ రూ.106.62కు చేరుకుంది. చెన్నై లో లీటర్ పెట్రోల్ రూ.106.35, డీజిల్ రూ.102.59కు పెరిగింది.


Next Story