ఆర్ఆర్ఆర్ ను ఇలా కూడా వాడేసిన ఆర్టీసీ ఎండీ
TSRTC MD IPS V.C Sajjanar Uses RRR Movie Unit Picture. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతూ ఉంది.
By Medi Samrat Published on 21 March 2022 6:47 AM GMTఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతూ ఉంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అదే రేంజిలో కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ ను ఆర్టీసీ కోసం వాడేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ అయిన సజ్జనార్ వినూత్న ఆలోచనలతో సంస్థను ముందకు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన తన బృందంతో కలిసి పెట్టిస్తున్న పోస్టులు భారీగా క్లిక్ అవుతూ ఉన్నాయి. ఆర్టీసీ సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.
@ssrajamouli @RRRMovie & #TSRTCRRR #TSRTC is at the Service of Public #RRR - రాష్ట్ర రోడ్డు రవాణా @TSRTCHQ @baraju_SuperHit @MilagroMovies @tarak9999 @AlwaysRamCharan @Chiru_FC @worldNTRfans @AlwaysCharan_FC @TV9Telugu @TarakSpace @NTRFanTrends @TeamNTRTrends #mondaythoughts pic.twitter.com/qXkKOq2jE3
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 21, 2022
తాజాగా ఆర్ఆర్ఆర్ మీద కూడా పోస్టు చేశారు ఆయన..! రాజమౌళికి సంబంధించిన ఆర్ఆర్ఆర్ అంటే 'రౌద్రం రణం రుధిరం' అని చెప్పగా.. తెలంగాణ ఆర్టీసీలో మాత్రం 'రాష్ట్ర రోడ్డు రవాణా' అని తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
అంతకు ముందు ఆర్ఆర్ఆర్ మూవీలోని ఎత్తర జెండా పాటను ఆర్జీసీ కోసం ఉపయోగించుకున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ పాటలో కనిపించారు. ఈ జెండాపై వందేమాతరం అంటూ ఉంటోంది. కానీ ఆర్జీసీ ఎండీ సజ్జనార్ .. వందేమాతరం ప్లేస్‌లో TSRTC అనే అక్షరాలు కనిపించేలా పోస్టర్‌ను టీఎస్ఆర్జీసీ ప్రచారం కోసం వాడుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలు తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.