వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు..!

TSRTC Bus Flow Away In Flood. తెలంగాణ‌లో గ‌త మూడురోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు

By Medi Samrat
Published on : 31 Aug 2021 12:27 PM IST

వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు..!

తెలంగాణ‌లో గ‌త మూడురోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌ద‌ల ధాటికి ప‌లువురు మృత్యువాత‌ప‌డ‌గా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద వరదనీటిలో చిక్కుకున్న టీఎస్‌ ఆర్టీసీ బస్సు ఈరోజు కొట్టుకుపోయింది. నిన్న వరద ప్రవాహంతో గంభీరావుపేట శివారు మానేరు వాగు లోలెవల్‌ బ్రిడ్జి వద్ద బస్సు చిక్కుకుంది.

బస్సులో ఉన్న సుమారు 25మంది ప్రయాణికులను స్థానిక రైతులు రక్షించారు. అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో బయటకు తెచ్చేందుకు యత్నించినా సాధ్యపడలేదు. వరద ప్రవాహం మ‌రింత ఎక్కువ అవ‌డంతో మంగ‌ళ‌వారం ఉద‌యం బస్సు కొట్టుకుపోయింది. కొట్టుకెళ్లిన బస్సు.. మానేరు వాగు మధ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బ‌స్సు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బస్సును ఈ రోజు వెలికి తీసే అవకాశముంది.


Next Story