టీఎస్ఆర్టీసీ ఉద్యోగులంద‌రూ ప్ర‌తి గురువారం అలా చేయండి : ఎండీ స‌జ్జ‌నార్‌

TSRTC asks employees to travel by buses every Thursday. టీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సంస్థ‌ పరిపాలనా కార్యాలయాల్లో పని చేసే

By Medi Samrat  Published on  10 Dec 2021 8:27 AM GMT
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులంద‌రూ ప్ర‌తి గురువారం అలా చేయండి : ఎండీ స‌జ్జ‌నార్‌

టీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సంస్థ‌ పరిపాలనా కార్యాలయాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులందరూ ప్రతి గురువారం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆదేశించింది. ఇక నుండి అధికారులు, ఉద్యోగులందరూ TSRTC బస్సుల్లో మాత్రమే కార్యాల‌యాల‌కు వ‌చ్చి వెళ్లాల‌ని ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ ఇక‌నుండి ప్ర‌తి గురువారం 'బస్ డే' ద్వారా ప్రయాణీకుల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సేవల నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మేర‌కు టీఎస్‌ఆర్‌టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం హైదరాబాద్‌లోని టెలిఫోన్‌ భవన్‌ బస్టాప్‌ నుంచి బస్సులో ఆయన కార్యాలయానికి వెళ్లారు. ప్రయాణికులతో మాట్లాడి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. బస్సుల టైమింగ్‌, సిబ్బంది ప్రవర్తన గురించి కూడా ఆరా తీశారు. మెహిదీపట్నం డిపోలో బస్సు ఎక్కి బస్ భవన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో దిగారు. సురక్షితమైన, అవాంతరాలు లేని ప్రయాణానికి ఇది చౌకైన రవాణా మార్గం కాబట్టి ప్రజలందరూ TSRTC బస్సులలో ప్రయాణించాలని ఆయన అభ్యర్థించారు.

టిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. అనంత‌రం మంచి డ్రైవింగ్, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించిన సిబ్బందికి సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలావుంటే.. మూడు నెలల క్రితం టిఎస్‌ఆర్‌టిసి ఎండీగా బాధ్యతలు స్వీకరించిన‌ సజ్జనార్ సంస్థ‌ సేవలను మెరుగుపరచడానికి.. బస్సులలో ప్రయాణించేలా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా స‌జ్జ‌నార్‌ కొన్ని సందర్భాల్లో సిటీ బస్సుల్లో ప్రయాణించారు.Next Story
Share it