గుడ్ న్యూస్.. గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గురువారం తెలియజేసింది

By Medi Samrat  Published on  22 Aug 2024 4:41 PM IST
గుడ్ న్యూస్.. గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గురువారం తెలియజేసింది. గ్రూప్-2లో మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. మొదట గ్రూప్-2 పోస్టులకు పరీక్షలు ఆగస్టు 7,8 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఇతర పోటీ పరీక్షలు రాసే వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో డిసెంబర్ నెలలో నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది. గ్రూప్-2 పరీక్ష కోసం 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-I జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ డిసెంబరు 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించనున్నారు, పేపర్-II, హిస్టరీ, Polity అండ్ Society అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌తో కూడిన పేపర్-III డిసెంబర్ 16, 2024న ఉదయం 10 నుండి 12.30 గంటల మధ్య, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుతో కూడిన పేపర్-IV అదే రోజు మధ్యాహ్నం 3 నుండి 5.30 గంటల మధ్య నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షలకు వారం రోజుల ముందు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Next Story