గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

TSPSC Group-I mains from June 5. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను

By Medi Samrat  Published on  31 Jan 2023 2:45 PM GMT
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే జూన్‌ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు మంగళవారం నోటిఫికేషన్‌లో తెలిపింది. పరీక్షలు జూన్ 5 నుంచి జూన్ 12 మధ్య హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబడతాయ‌ని కమిషన్ తెలిపింది.

జూన్ 5న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్), జూన్ 6న పేపర్-I జనరల్ ఎస్సే, జూన్ 7న పేపర్-II-హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, పేపర్-III-ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం జూన్ 8న గవర్నెన్స్, జూన్ 9న పేపర్-IV-ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, జూన్ 10న పేపర్-V-సైన్స్ అండ్ టెక్నాలజీ మ‌రియు డేటా ఇంటర్‌ప్రెటేషన్, జూన్ 12న పేపర్-VI తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాల‌పై ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. పరీక్ష సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కాగా.. ఒక్కో పేపర్‌కు గరిష్టంగా 150 మార్కులు ఉంటాయి.

ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప‌రీక్ష‌లు నిర్వహిస్తారు. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, గ్రూప్‌-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్‌పీఎస్‌సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు తీసుకుంది. అంటే ప్రిలిమ్స్‌కు హాజరైన వారి నుంచి 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేసింది.


Next Story