నేటి నుంచి రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు.. మార్గదర్శకాలివే..
TS SSC Exams 2022 begin today. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పదవ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 23 May 2022 8:46 AM ISTతెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పదవ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. 10వ పరీక్షలను సోమవారం నుండి ప్రారంభించనుంది. దీంతో విద్యార్థులు నేడు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు తమ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌లను రాయనున్నారు.
ఇదిలావుంటే.. విద్యాశాఖ హాల్ టిక్కెట్లను మే 12, 2022న విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్‌లను bse.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఈ పరీక్షలు COVID-19 భద్రతా ప్రోటోకాల్‌ల మధ్య ఆఫ్‌లైన్‌లో నిర్వహించబడతాయి. కొవిడ్ సంక్రమణ నుండి తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి విద్యార్థులు ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని అధికారులు సూచించారు.
TS SSC పరీక్షలు – మార్గదర్శకాలు
1. విద్యార్థులు విధిగా తమ హాల్ టిక్కెట్లను పరీక్ష హాల్‌కు తీసుకురావాలి. ఒకవేళ మరచిపోయినట్లయితే, పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించబడరు.
2. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తాయి.
3. విద్యార్థులందరూ అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించాలి. పరీక్ష హాల్ లోపల, వెలుపల సామాజిక దూరాన్ని కొనసాగించాలని సూచించారు.
4. తరచుగా శానిటైజేషన్ చేయడానికి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి విద్యార్ధులు హ్యాండ్ శానిటైజర్, స్వంత వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచిది.