తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదల

TS SSC 2022 exams from May 11. 2022 తెలంగాణ SSC పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది.

By Medi Samrat  Published on  11 Feb 2022 1:37 PM GMT
తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదల

2022 తెలంగాణ SSC పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ శుక్రవారం నాడు రాష్ట్రంలో SSC పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలు మే 11-17 మధ్య ఉదయం 9.30 నుండి 12.45 గంటల వరకు నిర్వహించబడతాయని నోటిఫికేషన్‌లో తెలిపారు. రెగ్యుల‌ర్ ఎస్ఎస్సీ, ఓపెన్ ఎస్ఎస్‌సీ, ఒకేష‌న‌ల్ రెగ్యుల‌ర్‌, ప్రైవేటు ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను తెలంగాణ ఎస్ఎస్‌సీ బోర్డు విడుద‌ల చేసింది. రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు మే 11 నుంచి మే 17 వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మే 18న ఓపెన్ ఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2(సంస్కృతం, అర‌బిక్‌), మే 20న ఎస్ఎస్‌సీ ఒకేష‌న‌ల్ కోర్స్‌(థియ‌రీ) ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ (DGE) SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షల కోసం పరీక్ష ఫీజు చెల్లింపు కోసం గడువు తేదీలను సవరించినట్లు తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 14 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ. 50, రూ. 200 ఆలస్య రుసుముతో విద్యార్థులు వరుసగా ఫిబ్రవరి 24, మార్చి 4 వరకు ఫీజులు చెల్లించవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 14 వ‌ర‌కూ పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.


Next Story