సీఎం కేసీఆర్‌తో మంత్రుల భేటీ

TS ministers meet CM KCR after their visit to Delhi. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌

By Medi Samrat  Published on  25 March 2022 4:55 PM IST
సీఎం కేసీఆర్‌తో మంత్రుల భేటీ

ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి బృందం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర మంత్రితో భేటీ అయిన సందర్భంగా మంత్రులు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యం మొత్తం సేకరించాలని పీయూష్‌ను కోరారు. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని తీసుకురావాలని కూడా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇదిలావుంటే.. మంత్రుల‌తో భేటీలో వరి కొనుగోళ్లపై భవిష్యత్ కార్యాచరణ విష‌య‌మై సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమీక్షించనున్నారు.







Next Story