రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే సూచనల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవుల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వి కరుణ ఇతర అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జులై 11 నుంచి 13 వరకూ అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ వర్ష సూచన ఉండటంతో సెలవులు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఓయూ, కేయూ పరిధిలో జరగాల్సిన పలు పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు ఆయా వర్సిటీల అధికార వర్గాలు ప్రకటించాయి. వర్షాల అనంతరం పరీక్షలు రీషెడ్యూల్ చేయబడతాయి.