తెలంగాణలో కొత్తగా 13 మండలాలు
TS Govt issue notices on new mandals in Telangana. తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి.
By Medi Samrat Published on 23 July 2022 5:18 PM IST
తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త మండలాలు..
-నారాయణపేట జిల్లా.. గుండుమల్, కొత్తపల్లె మండలాలు(నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధి)
-వికారాబాద్ జిల్లా.. దుడ్యాల్ మండలం ( తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
-మహబూబ్ నగర్ జిల్లా.. కౌకుంట్ల మండలం (మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
-నిజామాబాద్ జిల్లా..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు (ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
-నిజామాబాద్ జిల్లా.. సాలూర మండలం (బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధి)
-మహబూబాబాద్ జిల్లా.. సీరోల్ మండలం (మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధి)
-నల్గొండ జిల్లా.. గట్టుప్పల్ మండలం (నల్గొండ రెవిన్యూ డివిజన్ పరిధి)
-సంగారెడ్డి జిల్లా.. నిజాంపేట్ మండలం (నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధి)
-కామారెడ్డి జిల్లా.. డోంగ్లీ మండలం (బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధి)
-జగిత్యాల జిల్లా.. ఎండపల్లి మండలం (జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధి)
-జగిత్యాల జిల్లా.. భీమారం మండలం (కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధి)