తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు

TS Govt has given temporary postings to Some IPS officer.తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లువురు ఐపీఎస్‌ల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2022 10:13 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లువురు ఐపీఎస్‌ల‌కు తాత్కాలిక పోస్టింగ్‌లు ఇచ్చింది. హైదరాబాద్‌ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శిగా రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌ దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య, హైదరాబాద్‌ మధ్య మండల డీసీపీగా రాజేశ్‌ చంద్ర, హైదరాబాద్‌ తూర్పు మండల డీసీపీగా సతీశ్‌లను నియమించింది. సైబరాబాద్ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.

Next Story
Share it