హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 30వ తేదీని రాష్ట్ర ఉద్యోగులు, కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజున కర్మాగారాలు, వ్యాపారాలు, పరిశ్రమలను మూసివేయాలని రాష్ట్ర కార్మిక శాఖ సూచనలు చేసింది. అలాగే ఈ సెలవు దీనిని సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో పాల్గొనేందుకు అర్హులైన ఓటర్లను ఈ ఆదేశం ప్రోత్సహిస్తుంది.
అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లోని ప్రజలు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటు వేయనున్నారు. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో చేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ.. ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.