కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుల గృహ నిర్భంధం

TS Congress leaders house arrested.తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నాయ‌కులను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2022 11:46 AM IST
కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుల గృహ నిర్భంధం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నాయ‌కులను పోలీసులు బుధ‌వారం గృహ నిర్భందం చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్ట్రాట‌జీ టీమ్ హెడ్ సునీల్ క‌నుగోలు కార్యాల‌యాన్ని(కాంగ్రెస్ వార్ రూమ్‌)ను సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయ‌డంతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

దీన్ని నిర‌సిస్తూ నేడు(బుధ‌వారం) కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుల‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, మ‌ల్‌రెడ్డి రాంరెడ్డి త‌దిత‌రుల‌ను గృహ‌నిర్భంధం చేశారు. కాగా.. పోలీసులు తీరుపై మ‌ల్లు ర‌వి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీలపై నిర్భంధం ప్ర‌జాస్వామాన్ని ఖూనీ చేయ‌డ‌మేన‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న వ్య‌క్తం చేసే హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాగే చేస్తే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డతార‌ని హెచ్చ‌రించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నార‌ని అందిన ఫిర్యాల మేర‌కు కాంగ్రెస్ వార్ రూమ్‌ను పోలీసులు మంగ‌ళ‌వారం రాత్రి సీజ్ చేశారు. సునీల్ కార్యాల‌య‌న్ని సీజ్ చేసేందుకు వ‌చ్చిన సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌తో కాంగ్రెస్ నేత‌లు వాగ్వాదానికి దిగారు.

ఇదిలావుండగా.. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో పనిచేస్తున్న 5 మంది సభ్యులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంపై విదుర్‌నగర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఈరోజు పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా నోటీసు ఇచ్చారు. 41ఎ సిఆర్‌పిసి చూపకుండానే పోలీసులు వారిని అరెస్టు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.




Next Story