29న నిరసనలకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్

TS Bajrang Dal, Vishwa Hindu Parishad call for statewide protest on 29 Aug. ఆగస్టు 29న తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్త నిరసనల‌కు భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చాయి

By Medi Samrat
Published on : 28 Aug 2022 5:33 PM IST

29న నిరసనలకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్

ఆగస్టు 29న తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్త నిరసనల‌కు భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వీహెచ్‌పీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించింది. ముహమ్మద్ ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద వీడియో చేసినందుకు సస్పెండ్ చేయబడిన బిజెపి ఎమ్మెల్యే టి. రాజా సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇటీవల ముస్లింలు చేసిన నిరసనలను ఈ బృందం ప్రస్తావించింది.

ఇవే సమస్యలపై నాలుగు రోజుల క్రితం డీజీపీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం హిందూ వ్యతిరేక చర్యల్లో భాగమేనని భావిస్తున్నాం. హిందూ వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ హిందూ సమాజం ఐక్యంగా ఉద్యమించాలని భజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ పాల్గొని హిందూ శక్తిని చాటాలని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు.. పోలీసులు ముస్లింలను రెచ్చగొట్టి హిందువులను వేధిస్తున్నారు.

శాంతియుతంగా ఉన్న భాగ్యనగరాన్ని అల్లర్లతో ముంచెత్తే కుట్ర జరుగుతోందని అన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని రెండు హిందూత్వ గ్రూపులు డిమాండ్ చేశాయి. అల్లర్లకు పాల్పడిన యువకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గణేష్ చతుర్థికి ముందు హిందూ ద్రోహి మునవర్‌ను భాగ్యనగరంలో ప్రదర్శనకు అనుమతించిన కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి'' అని ప్రకటనలో పేర్కొన్నారు.


Next Story