ముందస్తు ఎన్నికలకు వెళ్లం.. రెండేళ్లలో అన్ని పనులు చేసుకుందాం.!

TRS Party meeting in telangana bhavan. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇంకా అధికారం ఉన్న రెండున్నర సంవత్సరాల్లో

By అంజి  Published on  17 Oct 2021 12:43 PM GMT
ముందస్తు ఎన్నికలకు వెళ్లం.. రెండేళ్లలో అన్ని పనులు చేసుకుందాం.!

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇంకా అధికారం ఉన్న రెండున్నర సంవత్సరాల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల భేటీ జరిగింది. భేటీలో పార్టీ ప్లీనరీ, సంస్థాగత ఎలక్షన్స్‌, సర్వసభ్య సమావేశం గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. నవంబర్‌ 15వ తేదీన వరంగల్‌లో 10 లక్షల మందితో విజయగర్జన సభ నిర్వహించునున్నట్టు కేసీఆర్‌ తెలిపారు.

అంతకంటే ముందు ఈ నెల చివరలో హజురాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మనపై అనవసర విమర్శలు చేస్తున్న వారి నోర్లు మూయించాలన్నారు. హుజురాబాద్‌ బై ఎలక్షన్‌లో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ప్లీనరీ, విజయగర్జన సభలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌.. తమ పార్టీ నేతలకు సూచించారు. బూత్‌ స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలని నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పని చేయాలని పిలుపునిచ్చారు.

Next Story
Share it