ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కౌశిక్ రెడ్డి

TRS MLC Padi Kaushik Reddy fire on Etala Rajender. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

By Medi Samrat  Published on  14 Sep 2022 2:08 PM GMT
ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కౌశిక్ రెడ్డి

బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. త‌న రాజ‌కీయాల కోసం అనేక మందిని హ‌త్య చేయించిన చ‌రిత్ర ఆయ‌న‌ద‌ని.. తాను చేసిన ఆరోప‌ణ‌లు అబ‌ద్ధ‌మైతే ముక్కు నేల‌కు రాయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని స‌వాల్ విసిరారు. గోతులు త‌వ్వే అల‌వాటు ఉన్న ఈట‌ల నీతులు చెబుతుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని అన్నారు. ఈట‌ల రాజ‌కీయ జీవితమంతా హ‌త్యా రాజ‌కీయాల‌తో ముడిప‌డి ఉంద‌ని.. త‌న ర‌క్త చ‌రిత్ర‌ను కేసీఆర్‌కు అంటించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. న‌ర్సింగాపూర్‌లో ఈట‌ల‌పై గ్రామ‌స్థులు చెప్పుల‌తో దాడి చేసింది నిజం కాదా అంటూ నిల‌దీశారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుడు ప్ర‌వీణ్ యాద‌వ్‌పై ఈట‌ల రాజేంద‌ర్‌ మంత్రిగా ఉన్నప్పుడు దాడి చేయించింది నిజం కాదా? అని ప్ర‌శ్నించారు. 25 రోజుల క్రితం మ‌ల్ల‌య్య‌పై దాడి చేయించింది కూడా ఈట‌లేన‌ని అన్నారు. ఈ ర‌క్త చ‌రిత్ర‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మేనా అని ఈట‌ల రాజేంద‌ర్‌కు కౌశిక్ రెడ్డి స‌వాల్ విసిరారు.

ఈట‌ల‌కు.. కేసీఆర్‌కు.. న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంద‌న్నారు. ఈట‌ల మంత్రిగా ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో ఏ ప‌ద్ధ‌తులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అవే ప‌ద్ధ‌తులు అమ‌ల్లో ఉన్నాయ‌ని గుర్తుచేశారు. ఈట‌ల పార్టీ మారినంత మాత్రాన అసెంబ్లీలో ప‌ద్ధ‌తులు మారుస్తారా అంటూ ప్ర‌శ్నించారు. అన్నం పెట్టిన కేసీఆర్‌కు అసెంబ్లీ ప‌ద్ధ‌తులు మారుస్తారా అంటూ అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హుజూరాబాద్‌ అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటే పారిపోయిన చరిత్ర ఈట‌లదని అన్నారు.


Next Story
Share it