ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆ ఇద్దరికి ఊరట

TRS MLAS Purchas Case it in high court shock relieffor those two rsk. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్

By Medi Samrat  Published on  5 Dec 2022 8:45 PM IST
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆ ఇద్దరికి ఊరట

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై స్టే ఆర్డర్ ను తెలంగాణ హైకోర్టు డిసెంబరు 13 వరకు పొడిగించింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ, వాటిపై స్టే ఇవ్వాలని కోరుతూ వారిద్దరు దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది. నోటీసులపై ఈనెల 13 వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఎల్ సంతోష్ కేసులో కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీంతో వారికి సమయం ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు సిట్ నవంబరు 23న నోటీసులు జారీచేయగా.. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. నవంబరు 25న బీఎల్ సంతోష్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. డిసెంబరు 5 వరకు స్టే కొనసాగుతుందని అప్పట్లో కోర్టు ప్రకటించింది. ఇప్పుడు డిసెంబరు 13 వరకు పొడిగించింది.


Next Story