ఇదెక్కడి షాకింగ్ ట్విస్ట్.. డ్రగ్స్ వ్యవహారంలో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలా..?

TRS MLAs In Drugs Scandal. బెంగళూరు డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. బెంగళూరు నగరంలో

By Medi Samrat  Published on  3 April 2021 10:19 AM GMT
ఇదెక్కడి షాకింగ్ ట్విస్ట్.. డ్రగ్స్ వ్యవహారంలో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలా..?

బెంగళూరు డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. బెంగళూరు నగరంలో కొద్దిరోజుల కిందట డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. బెంగళూరు నగరంలో పబ్ లు, హోటళ్లను హైదరాబాద్ వ్యాపారవేత్తలు సందీప్‌రెడ్డి, కలహర్‌రెడ్డి లకు, కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడ్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టు నైజీరియన్లు చెప్పడంతో పోలీసులు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే సందీప్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కలహర్ తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇచ్చేవారని సందీప్ పోలీసులకు తెలిపారు. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీల్లో పాల్గొన్నారని.. నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నారని సందీప్ చెప్పడం సంచలమైంది. ఓ ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్ పంపినట్టు కూడా సందీప్ పోలీసులకు తెలిపారు.

బెంగళూరులో పబ్‌లు, హోటళ్లు నిర్వహించే సందీప్‌రెడ్డి, కలహర్‌రెడ్డి తెలంగాణకు చెందిన ప్రముఖులకు పార్టీ ఇచ్చేవారని తెలిసింది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, పలువురు సినీ ప్రముఖులు సందీప్‌, కలహర్ పార్టీల్లో పాల్గొనేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.‌ కన్నడ సినీ నిర్మాత శంకర్‌ గౌడతో కలిసి సందీప్‌, కలహర్‌ సినిమాలకు ఫైనాన్స్‌ కూడా చేస్తున్నట్టు తేలింది. ఇటీవల డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ నైజీరియన్‌ బెంగుళూరు పోలీసులు విచారించగా..‌ సందీప్‌, కలహర్‌, శంకర్‌ గౌడకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం.

దీంతో ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నుంచి కలహర్‌రెడ్డి, శంకర్ గౌడ తప్పించుకుని తిరుగుతుండగా సందీప్‌రెడ్డిని బెంగళూరు పోలీసులు విచారించారు. కలహర్‌రెడ్డి ప్రజాప్రతినిధులకు పార్టీ ఇచ్చేవాడని.. వీరిలో తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు ఉన్నట్టు బయటపెట్టాడు. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. త్వరలో నోటీసులు పంపే అవకాశం కూడా ఉంది.


Next Story