టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..!
TRS MLA Gudem Mahipal Reddy booked for threatening journalist. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ
By Medi Samrat Published on 9 Dec 2020 7:00 AM GMT
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ వార్తలు రాసినందుకు స్థానిక రిపోర్టర్ సంతోష్‌ను ఫోన్‌లో బెదిరించారు మహిపాల్ రెడ్డి. నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిపాల్ రెడ్డిపై 109,448,504,506, 3(2)(va) SC ST POA ACT 2015 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
నిన్న.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, విలేకరి సంతోష్ ని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో ఒకటి వైరల్‌గా మారింది. గత కొన్ని రోజుల క్రితం పఠాను చెరువు లో జరిగిన అక్రమాలు కబ్జాలపై స్థానిక విలేకరి వరుస కథనాలు రాసాడు. దీనిపై ఆగ్రహం చెందిన పఠాను చెరు ఎమ్మెల్యే , విలేకర్ ని ఫోన్లో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నీవు ఎవ్వడివిరా? అంటూ రిపోర్టర్‌పై విరుచుకుపడ్డారు. బూతు పురాణం అందుకోవడమే కాదు.. వస్తావా? లేదా ఎక్కడున్నావో చెప్పు.. నేనే వస్తా.. కాళ్లు చేతులు నరికేస్తానంటూ బెదిరింపులకు దిగారు. కావాలంటే నేను మాట్లాడేది రికార్డు చేసుకో.. ఎస్పీకి, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసుకో.. నీ సంగతి చూస్తానంటూ రిపోర్టర్‌ను భయాందోళనకు గురిచేశారు ఎమ్మెల్యే. ఆ ఆడియో కాస్త బయటికి రావడంతో వైరల్ అయింది.