స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

TRS Local Bodies MLC Candidates List. టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారయ్యింది.

By Medi Samrat  Published on  21 Nov 2021 2:39 PM GMT
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారయ్యింది. ఢిల్లీ వెళ్లే ముందు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ అభ్యర్దులను ఖరారు చేశారని ఓ లిస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అంతేకాదు.. పలువురు అభ్యర్దులకు భీ.ఫాం కూడా ఇచ్చినట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఇదే లిస్టును టీఆర్ఎస్ అధిష్ఠానం రేపు అధికారికంగా ప్రకటించనున్నార‌ని స‌మాచారం. ఇక అభ్య‌ర్ధిత్వం ఖ‌రారైన పలువురు అభ్యర్దులు రేపు, ఎల్లుండి నామినేషన్లు వేయనున్న‌ట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో కొందరికి సీట్లు రెన్యూవల్ కాగా.. మరికొందరికి మొండిచెయ్యి చూపిన‌ట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్ - దండే విఠల్

మహబూబ్ నగర్ - సాయిచంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఖమ్మం - తాత మధు

రంగారెడ్డి - శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి

వరంగల్ - పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ - ఎం.సీ కోటిరెడ్డి

మెదక్ - డాక్టర్ యాదవ రెడ్డి

కరీంనగర్ - ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు.

నిజామాబాద్ - కల్వకుంట్ల కవిత లేదా ఆకుల లలిత


Next Story
Share it