రాజ్య‌స‌భ స‌భ్యులుగా దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌థి ప్ర‌మాణం

TRS Leaders Takes Oath As Rajya Sabha Member. నమస్తే తెలంగాణ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివకొండ దామోదర్ రావు,

By Medi Samrat  Published on  24 Jun 2022 3:32 PM IST
రాజ్య‌స‌భ స‌భ్యులుగా దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌థి ప్ర‌మాణం

నమస్తే తెలంగాణ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివకొండ దామోదర్ రావు, హెటెరో ఫార్మా వ్యవస్థాపకులు బండి పార్థసారధిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలు తెలుగులోనే ప్రమాణం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి కేసీఆర్ వెంట నడిచిన వారిలో జగిత్యాల జిల్లా మద్దునూరుకు చెందిన దివకొండ దామోదర్ రావు ఒకరు. 2001 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కార్యదర్శిగా - ఆర్థికంగా పనిచేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బండి పార్థసారథి రెడ్డి హెటెరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించిన పార్థసారధిరెడ్డి కందుకూరులో డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హెటిరో కంపెనీని స్థాపించాడు. కంపెనీలో పది వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించి విద్యావేత్తగా సేవలందిస్తున్నారు. పార్థసారథి రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు, వీరి కుంటుంబం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటుంది.

అలాగే.. రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ నూతన ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సమక్షంలో ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.














Next Story