అభిమానం చాటుకున్న యువ‌నేత‌.. ఎమ్మెల్సీ క‌విత‌కు ఓ రేంజ్‌లో బ‌ర్త్ డే విషెస్‌

Trs leader Wishes To Kalvakuntla Kavitha. తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఊహించ‌ని బ‌ర్త్ డే

By Medi Samrat  Published on  13 March 2021 4:38 AM GMT
అభిమానం చాటుకున్న యువ‌నేత‌.. ఎమ్మెల్సీ క‌విత‌కు ఓ రేంజ్‌లో బ‌ర్త్ డే విషెస్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు ఊహించ‌ని బ‌ర్త్ డే గిప్ట్ ఇచ్చాడు టీఆర్ఎస్ యువ‌నేత‌. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగ‌ణంలో నేలపై 60 అడుగుల క‌విత భారీ చిత్రాన్ని పెయింటింగ్‌గా వేయించాడు. నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ యువ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ కవిత మీద అభిమానంతో ఈ చిత్రాన్ని వేయించార‌ని తెలుస్తోంది.

మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు శైలేష్ కులకర్ణి చేతుల్లో రూపుదిద్దుకున్న ఈ కళాఖండం వ్యయం అక్ష‌రాల‌ లక్ష రూపాయలని స‌మాచారం. అయితే.. ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి కళాకారులు 20 గంటలకు పైగా శ్రమించారు. రవీంద్రభారతి బయట వేసిన ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడుతున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. క‌విత పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయ‌కులు, కార్య‌కర్తలు, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విష్ చేస్తున్నారు.


Next Story
Share it