సంబరాల్లో తుపాకీ తీసిన టీఆర్ఎస్ నేత.. తేడా కొట్టేసింది..!
TRS Leader Hulchul With Gun. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు స్థానాల్లోనూ విజయాన్ని అందుకుంది
By Medi Samrat Published on 21 March 2021 7:27 AM GMTతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు స్థానాల్లోనూ విజయాన్ని అందుకుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించగా, నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. దీంతో అభిమానుల్లోనూ, ఆ పార్టీ నాయకులు సంతోషంలో మునిగిపోయారు.
తాజాగా గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీ తో హల్ చల్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. శనివారం నాడు తెలంగాణ భవన్లో ఎంఎల్సీ ఎన్నికల గెలుపు సంబరాల్లో గన్ బయటికి తీశారు శ్రీనివాస్ యాదవ్. గాల్లోకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న వారు వారించడంతో గన్ ను లోపల పెట్టుకోవడం జరిగిందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంతో సంబరాలు చేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు శ్రుతిమించాయి. కార్యకర్తలు, నేతల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. టపాసులు కాల్చడంతో మంటలు చెలరేగగా మంటలను ఆర్పడానికి చాలా కష్టపడ్డారు.
ఇక సంబరాల్లో చిందేసిన శ్రీనివాస్ యాదవ్ మరింత అతి చేయడం ఇప్పుడు టీఆర్ఎస్ కు చెడ్డ పేరు తీసుకొని వస్తోంది. తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకలకు హాజరైన కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఒక్కసారిగా తుపాకీ బయటికి తీశారు. పైకెత్తి అందరికీ చూపిస్తూ హల్‌చల్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించారు. నేతలు వారించడంతో గన్ లోపల పెట్టేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీనివాస్ యాదవ్‌కు లైసెన్స్‌డ్ తుపాకీ ఉందని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. కానీ ఇలా తుపాకీని బయటకు తీసి ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారంటూ విమర్శలు కూడా ఎక్కువయ్యాయి.