తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు టీఆర్ఎస్ నేత‌లు ఫిర్యాదు

TRS Complaints Against Fake News. టీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం

By Medi Samrat  Published on  30 Oct 2021 3:00 PM GMT
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు టీఆర్ఎస్ నేత‌లు ఫిర్యాదు

టీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు శ‌నివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేఫ‌థ్యంలో టీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. దుబ్బాక ఎన్నికల అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడిన వీడియో లను హుజురాబాద్ ఎన్నికల సందర్బంగా వైరల్ చేయడంపై ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ కమల దళం పేరుతో బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ వీడియోలు చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు. ఓటమి భయం తోనే బీజేపీ నాయకులు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.


Next Story