తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం.!

TRS activists protest against Revanth Reddy. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలపై పీసీసీ రేవంత్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహాం

By అంజి  Published on  16 Feb 2022 10:02 AM GMT
తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం.!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలపై పీసీసీ రేవంత్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వింగ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ఐటీ సెల్‌ కార్యకర్తలు రేవంత్‌ రెడ్డికి పిండ ప్రదానం చేశారు. రేవంత్‌ రెడ్డి ఫొటోతో పాటు పిండాలను తీసుకెళ్లి మూసీ నదిలో కలిపి.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి అమర్‌ హే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌ సోషల్‌ మీడియా స్టేట్‌ కన్వీనర్‌ వై.సతీష్‌ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు పెంపుడు కుక్క రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకల సందర్భంగా.. పార్కీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలని, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే రేవంత్‌ రెడ్డి దీన్ని రాజకీయం చేస్తున్నారని సతీష్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ''అరేయ్ రవ్వంత బుడ్డరఖాన్.. పన్నెండొద్దులు చేసుడు గిట్లనేనా ?.. పిండాలతోనే సరిపెట్టాల్నా ?.. లేకపోతే "గోరి" కూడా కట్టియ్యాల్నా ?.. బిడ్డా.. నీ బాస్ చంద్రబాబుకు పట్టిన గతే నీకూ పడ్తది తెలంగాణల.!'' అంటూ ట్వీట్‌ చేశాడు.

Next Story
Share it