తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలో హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారుజామున పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయానికి వచ్చిన అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విగ్రహాలు ధ్వంసమైన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
స్థానికుల ప్రకారం.. దుండగులు ఆలయ ద్వారం తెరిచి విగ్రహాలను రాళ్లతో ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక బీజేపీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనను ఖండించారు. విధ్వంసం గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్ కాలనీలోని ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం ఉన్న ఎయిర్‌పోర్ట్ కాలనీలో పోలీసులు భద్రతను పెంచారు.