తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో అధికారుల (ఐపీఎస్, ఐఏఎస్) బదిలీలు, నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. ఆదివారం కూడా ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం బదిలీల ఉత్తర్వలను జారీ చేసింది. ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎక్సైజ్ కమిషనర్‌గా ఈ. శ్రీధర్‌ను నియమించింది. అలాగే టీఎస్‌ఐఐసీ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
పౌరసరఫరాల కమిషనర్‌గా దేవేంద్ర సింగ్ చౌహాన్(ఐపీఎస్)కు బాధ్యతలు అప్పగించింది. ఇంటర్ విద్య డైరెక్టర్‌గా శ్రుతి ఓజా, గిరిజ సంక్షేమ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డిని నియమించారు. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం.. ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. భారతి స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్ పొత్రుకు బాధ్యతలు అప్పగించింది.