విషాదం.. టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి మృతి

టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లి ఎగ్జామ్‌ సెంటర్‌లో గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో జరిగింది.

By అంజి
Published on : 15 Sept 2023 1:46 PM IST

Pregnant woman died, TET exam, Telangana, Sangareddy District

 Pregnant woman died, TET exam, Telangana, Sangareddy District

టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లి ఎగ్జామ్‌ సెంటర్‌లో గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో జరిగింది. ఇస్నాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్‌ పరీక్ష రాసేందుకు వచ్చిన 8 నెలల గర్భిణీ అభ్యర్థిని రాధిక మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టెట్‌ అభ్యర్థిని రాధిక.. పరీక్ష రాసేందుకు గచ్చిబౌలి నుంచి తన భర్త అరుణ్‌తో కలిసి వచ్చింది.

నిమిషం ఆలస్యమైనా అనుమతించరనే భయంతో పరీక్షా హాల్‌కు వెళ్లేందుకు వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలోనే బీపీ ఎక్కువై, చెమటలు పట్టేశాయి. పరీక్షా హాల్‌లో గర్భీణి రాధిక ఒక్కసారి కుప్పకూలి పోయింది. వెంటనే ఆమెను గురుకుల సిబ్బంది, పోలీసులు పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో రాధిక కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story