సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. నారాయణపేట నుంచి నర్సాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బైక్.. కల్వర్టు గుంతలో పడింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను అవుటి నర్సింహులు(27), జిన్న మల్లేష్(24), జిన్న మహేష్(23) గుర్తించారు. వీరు నారాయణపేట నుంచి నర్సాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. కాగా, నిజాంపేట-బీదర్ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న 160బి హైవేపై కల్వర్టు కోసం తవ్విన గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ముగ్గురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో నర్సాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.