విషాదం.. భద్రాచలం గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు

భద్రాచలంలోని గోదావరి నదిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర విషాదం చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 20 March 2026 2:30 PM IST

Telangana, Bhadrachalam, Godavari River, Tragedy, Drowning Accident

విషాదం.. భద్రాచలం గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు

భద్రాచలంలోని గోదావరి నదిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర విషాదం చోటు చేసుకుంది. గొల్లగూడెం ఇసుక దిబ్బ వద్ద స్నానం చేయడానికి నదిలోకి దిగిన ఏడుగురు యువకులలో ఐదుగురు నీటిలో మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకుని సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గల్లంతైన వారి కోసం నిపుణులైన ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story