హుజురాబాద్ ఎన్నికల అభ్యర్థి-వ్యూహంపై చర్చ జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల అభ్యర్థి- ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగిందని.. ఆ జిల్లా నేతల అభిప్రాయం తీసుకున్న తరువాత సెప్టెంబర్ 10వ తేదీ వరకు అభ్యర్థి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజా వ్యతిరేక చట్టాలు, కార్యక్రమాలు చేస్తున్నాయని అన్నారు.
హుజురాబాద్ లో జరిగే త్రిముఖమైన పోటీలో అశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. హుజురాబాద్ లో లోకల్ అభ్యర్థిని పోటీలో ఉంచాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీ వరకు రెండు దలిత దండోరా సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గజ్వేల్ లో సభ పెట్టాలా..? లేదా ఆ నియోజకవర్గంలో మరెక్కడైనా పెట్టాలా అనేది నిర్ణయం తీసుకోవాల్సివుందని తెలిపారు. 17న జరిగే ఫైనల్ సభకు సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే వస్తారని వెల్లడించారు.