మీరు అధికారం కోల్పోయిన రోజు ఇలాంటి పరిస్థితే మీకు వస్తే..

TPCC Working President Jaggareddy Fire On TRS Govt. కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వ్యవహారాలకి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను

By Medi Samrat  Published on  14 Dec 2022 10:37 AM GMT
మీరు అధికారం కోల్పోయిన రోజు ఇలాంటి పరిస్థితే మీకు వస్తే..

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతునందుకు టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొందరు పోలీస్ అధికారుల ద్వారా కాంగ్రెస్ పార్టీ అనుబంధం కార్యాలయంపై రాత్రి తనిఖీల పేరుతో దాడి చేసి అక్కడున్న స్టాఫ్ ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామ‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పోలీస్ సెక్షన్ లను అడ్డంపెట్టుకొని అక్కడున్న కంప్యూటర్స్, లాప్ టాప్ సీజ్ చేసి, కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కి తాళం వేయడాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉందికదా అని.. ఇష్టనుసారంగా కొందరు పోలీస్ అధికారులతో చట్టం లో ఉన్న సెక్షన్ లను అడ్డం పెట్టుకొని తెలంగాణ వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుందని విమ‌ర్శించారు.

రాష్ట్రంలో లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టి, ప్రజాస్వామ్య గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ లో లేని సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ తీసుకొని రావడం.. ఆ పార్టీ కి ఏనాటికైనా ప్రమాదమేనని గుర్తించుకోవాలని హితువు ప‌లికారు. తాను పాలు పోసి పెంచిన పాము తననే కాటేస్తుందనే విషయం తెలియదా..? అధికారం పూర్తిగా ఎప్పటికి టీఆర్ఎస్ దే అని ఉహించుకువడం కూడా మూర్ఖత్వమే అని జ‌గ్గారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. మీరు అధికారం కోల్పోయిన రోజు ఇలాంటి పరిస్థితే మీకు వస్తే.. ఆ రోజు మీరు ఏ ముఖంపెట్టుకొని మాట్లాడగలుగుతారని ప్ర‌శ్నించారు.

అధికారంలో ఎవరు ఉంటే పోలీస్ వారి మాట వినాల్సిందే అది చట్టం.. రేపు మేము అధికారంలోకి వస్తే.. ఈ చట్టం మా మాట విని మేము చెప్పిన్నట్లు చేస్తే మీ పరిస్థితి ఏంటి..? అని నిల‌దీశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కొత్త కొత్త ప్రయత్యాలను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని మండిప‌డ్డారు. ప్రతిపక్షాలను అణ‌గదొక్కడానికి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు. ప్రజలు టీఆర్ఎస్ కి అధికారం ఇచ్చింది.. ప్రజా సమస్యలు పరిష్కరించమని.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని అణ‌గ‌దొక్కమని కాదని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కొందరు పోలీస్ అధికారుల తీరుకి నిరసనగా ఉద్యమం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం, న్యాయ పోరాటం చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నుండి జగ్గారెడ్డి హెచ్చరిక జారీ చేశారు.



Next Story