కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినోడిలా మాట్లాడుతుండు : జగ్గారెడ్డి
మాజీ మంత్రి కేటీఆర్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 20 Aug 2024 4:18 PM ISTమాజీ మంత్రి కేటీఆర్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా కేటీఆర్.. మా ధైర్యం, మా సాహసాల మీద నువ్వెంత అని నిప్పులు చెరిగారు. కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినోడిలా మాట్లాడుతున్నాడని కౌంటరిచ్చారు. ఐదు సంవత్సరాలలో మీకు రాజీవ్ గాంధీ విగ్రహం తీసే దమ్ము, ధైర్యం లేదు.. మీరు కులగొట్టాలంటే అధికారంలోకి రావాలి. కానీ మేము మళ్ళీ ఐదు ఏండ్లు అధికారంలో ఉంటాం.. ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇచ్చారని అన్నారు.
యూపీఏ గవర్నమెంట్ లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి చేసిండు.. కేటీఆర్ సమాధానం చెప్పాలి.. తెలంగాణ కోసం మీ కుటుంబం ఢిల్లీకి పోయినప్పుడు సోనియాగాంధీకి గులాం గిరి చేయలేదా..? దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీ బలిదానం కావడం నిజమే కదా.? అని ప్రశ్నించారు. ఆయన 18 సవత్సరాలు ఉన్న ప్రతి యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించిండు.. రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీలో చదువుకొని కేటీఆర్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేసిండు.. అలాంటి వ్యక్తికి ధన్యవాదాలు తెలిపే గుణగణాలు కూడా లేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో కేటీఆర్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని సూచించారు. కేటీఆర్ కు ఎలాంటి ఇష్యూ మాట్లాడాలో తెలుస్తలేదు.. కేసీఆర్ కేటీఆర్ కు కోచింగ్ ఇప్పిస్తే మంచిదని సూచించారు.