టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం సాయంత్రం ఆయన ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం రావడంతో ప్రయాణం రద్దయింది. దీంతో రోడ్డు మార్గంలో రేవంత్ రెడ్డి కామారెడ్డికి బయలుదేరారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన మూడు సభలలో పాల్గొనవలసి ఉంది. రోడ్డు మార్గంలో రావడంతో సభలకు ఆయన ఆలస్యంగా వచ్చే అవకాశముంది. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కీలక హామీ ఇచ్చారు. విద్యాశాఖలో పని చేస్తోన్న ఎస్ఎస్ఏ (తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు) ఉద్యోగులు వారి న్యాయమైన హక్కుల కోసం నెల రోజుల పాటు ఆందోళన చేసిన విషయం నా దృష్టిలో ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.