హైదరాబాద్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. స్వామి వివేకానంద యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం నింపిన మహానేత. ఆయన ఆలోచనలు, బోధనలు నేటి యువతకు మార్గదర్శకాలు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న మహానేత సందేశం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని అన్నారు.
యువత విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. యువత సాధికారతే రాష్ట్రం, దేశ అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, యువత సమాజ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. జాతీయ ఐక్యత, సమగ్ర అభివృద్ధి దిశగా యువత అడుగులు వేయాలని టీపీసీసీ చీఫ్ ఆకాంక్షించారు.