క‌రాటేలో బ్లాక్ బెల్ట్ నెగ్గిన టీపీసీసీ అధ్యక్షుడు

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ప్రధానం జ‌రిగింది.

By Medi Samrat
Published on : 31 March 2025 5:10 PM IST

క‌రాటేలో బ్లాక్ బెల్ట్ నెగ్గిన టీపీసీసీ అధ్యక్షుడు

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ప్రధానం జ‌రిగింది. ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి సర్టిఫికేట్ పొందిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. YWCAలో ఈ రోజు 3 గంటల పాటు జరిగిన పరీక్షలో మహేష్ కుమార్ గౌడ్ నెగ్గారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇప్పటి సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను ఒక కంప్యూటర్ కిడ్స్ ల తయారు చేస్తూ మానసిక వత్తిడికి గురి చేస్తున్నారని.. క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

తను ఎంత బిజీ ఉన్న కరాటేకు తప్పకుండా సమయం కేటాయిస్తానని.. కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ ఉపాధ్యక్షులుగా కరాటే పోటీల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు. ఈ రోజు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ తీసుకోవడం నాకు గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు. తాను కరాటే పోటీలలో పలు దేశాలలో పర్యటించానని.. ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ తదితర దేశాలలో ప్రతి ఇంటిలో ఒక క్రీడాకారుడు తప్పకుండా ఉంటారని అన్నారు. పిల్లలు క్రీడలలో రాణిస్తే అన్ని విధాలుగా మంచిదని అన్నారు. తల్లిదండ్రులు క్రీడల పట్ల ప్రోత్సహించాలని అన్నారు. అందుకే గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ జాతీయ కరాటే పోటీలను నిర్వహించామని అన్నారు. భవిష్యత్ లో 2027లో ఆసియా కరాటే పోటీలు కూడా ఇక్కడే నిర్వహిస్తామని తెలిపారు.

Next Story