తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి : టీపీసీసీ చీఫ్
బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 4 Feb 2025 5:43 PM ISTబీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ కులగణనతో రాహుల్ గాంధీ ఆశయం నెరవేరిందన్నారు. దేశంలో ఫస్ట్ టైం కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసిందన్నారు. తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం కుల గణన సర్వే.. తెలంగాణలో బీసీలు 50 శాతం పైగా ఉన్నారని కుల సర్వేతో వెలుగులోకి వచ్చిందన్నారు. కీలక సమావేశాలకు అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు.? అని ప్రశ్నించారు. మండలి కౌన్సిల్ నుంచి బీఆర్ఎస్ నేతల వాకౌట్‌తో బీసీల పట్ల చిత్త శుద్ధి ఏంటో తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించే సత్తా ఉందా.? అని ప్రశ్నించారు.
బీసీ కుల గణనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుందన్నారు. తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే క్రమ శిక్షణ చర్యలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటకి కట్టుబడి కుల గణన సర్వేను పూర్తి చేసింది. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్- కవిత- హరీష్ మధ్య వార్ పీక్స్‌కు చేరిందన్నారు. బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోంది.. సోషల్ మీడియాలో కేటీఆర్ - కవిత అనుచరుల సోషల్ వార్ నడుస్తోందన్నారు.
కులగణనపై శాసనమండలిలో జరిగే చర్చలో కవిత మాట్లాడకుండా కేటీఆర్ పకడ్బందీ స్కెచ్ వేశాడన్నారు. కుల గణనపై హరీష్ రావు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. బీజేపీకి బీసీల పట్ల చిత్త శుద్ధి ఉంటే దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్నారు. దేశంలో ఫస్ట్ టైం కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసింది.. తెలంగాణ ప్రభుత్వం సంకల్ప బలంతో కులగణన సర్వేను పూర్తి చేసిందన్నారు. కుల సర్వేలో పాల్గొన్న అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, సబ్ కమిటీకి, కాంగ్రెస్ శ్రేణులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కుల నివేదిక అంశాలను కులంకూషంగా చర్చించి క్యాబినేట్ సబ్ కమిట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో బీసీ జనాభా 46.25 శాతంగా ఉన్నట్లు సర్వేలో తేలిందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టే కులగణన సర్వే చేశాం.. కుల సర్వేలో అనుమానాలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి అని సూచించారు.