అన్ని రకాల జూదాలకు కేటీఆర్ నాయకుడు.. టీపీసీసీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రంలో రాక్షస పాలన చేసింది బీఆర్ఎస్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిప‌డ్డాడు.

By Medi Samrat  Published on  13 Feb 2025 7:33 PM IST
అన్ని రకాల జూదాలకు కేటీఆర్ నాయకుడు.. టీపీసీసీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రంలో రాక్షస పాలన చేసింది బీఆర్ఎస్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిప‌డ్డాడు. కేటీఆర్ తెలంగాణలో యువతను మత్తుతో చిత్తు చేసాడని ఆరోపించారు. ఆయన డ్రగ్స్‌తో తెలంగాణను నాశనం చేస్తూ.. ఆయన బినామీకి కాసినో, కోళ్ల పందాలు అప్పగించాడు.. కేటీఆర్, సంతోష్‌లకు వ్యాపార భాగస్వామిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హాయాంలో సన్ బర్న్ పార్టీల పేరుతో పాశ్చాత్య సంస్కృతిని హైదరాబాద్ తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది.. బీఆర్ఎస్ హాయాంలో కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లోనే పోచంపల్లి ఫౌంహౌస్ దందా నడిచిందన్నారు. జన్వాడ ఫౌంహౌస్ కేసులో అపుడు డ్రగ్స్ ఇచ్చిన కేసులో పోచంపల్లికి లింక్ ఉందని అనుమానాలు ఉన్నాయి. ఫౌంహౌస్‌లలో క్యాసినో, పేకాట, కోళ్ళ పందేలు ఆడిపిస్తూ తెలంగాణ సమాజాన్ని జూదల వైపు నెడుతున్నారన్నారు. పార్టీలు, దందాలను కేటీఆర్, సంతోష్, పోచంపల్లి ప్రధాన వృత్తిగా మార్చుకున్నారన్నారు. తెలంగాణను కేటీఆర్ క్యాసినో హబ్‌గా మార్చారని ఆరోపించారు. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో.. జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్‌లో జరుగుతున్నాయి.. ఆయన కేటీఆర్ అండ‌తోనే ఇలాంటి పనులు చేస్తున్నాడన్నారు.

గతంలో రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ చేస్తే కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళి పరువు నష్టం కేసు పెట్టి తప్పించుకున్నారు. కేసీఆర్ కుటుంబం వాళ్ల కోసమే రాజకీయాలు చేస్తూ జనాన్ని పీడిస్తున్నారన్నారు. BRS హాయంలో ఇచ్చిన పర్మిషన్ తో ఫామ్ హౌస్ లో గత రెండేళ్ల నుంచి ఈ పందేలు జరుగుతున్నాయన్నారు. డ్రగ్స్ కు, కేసినోకు అంతర్జాతీయ దొంగలకు, నాయకుడు KTR అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జైలుకు వెళుతూ, ఫార్ములా రేస్‌లో విచారణకు వెళ్లి జై తెలంగాణ అంటారని ఎద్దేవా చేశారు. జై తెలంగాణను కేసీఆర్ కుటుంబం అవమాన పరుస్తుందన్నారు. తెలంగాణలో జరిగే అన్ని రకాల జూదాలకు కేటీఆర్ నాయకుడు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అందరూ ఏదో ఒక అవినీతిలో అక్రమాలలో ఉన్నారు.. అందరిపైన విచారణ జరిపి తెలంగాణ యువతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story