టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా.. రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చెప్పట్టి.. ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ ఇథనాల్ కంపనీ కి అనుమతి 7 జులై 2023 లో టీఆర్ఎస్ హాయంలో వచ్చిందన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపనీ కి కేసిఆర్ అనుమతి ఇచ్చాడు. డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఇచ్చింది. 18.351 MCAT నీళ్ళు వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారన్నారు. ఇథనల్ కంపానికి అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తున్నారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులను ముంచింది మీరే.. ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చ గొడుతున్నాడన్నారు. ఎట్లా అనుమతులు ఇచ్చారు అని దిలవర్ పూర్ రైతులు BRS నేతలను ప్రశ్నించాలి. ఆ ఊరుకి వెళ్లి చర్చిద్దాం రండన్నారు.
రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ కి ఓటు వేసింది మీరు కదా.. మహేశ్వర్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నట్లు తెలపా లన్నారు. కంపనీ పెట్టింది టీఆర్ఎస్ నాయకుడు.. పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్, కేసిఆర్ లు. కాంగ్రెస్ కి ఏం సంబంధం అన్నారు. ఇలాంటి దబుల్బాజీ పనులు టీఆర్ఎస్ నేతలు మానుకోవాలన్నారు. కేటీఆర్ కి సిగ్గు ఉండాలి.. ఈ అనుమతులు ఇచ్చింది ఎవరన్నారు. ఇథనల్ కంపనీ కేటీఆర్ ప్రాజెక్టు. రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఇథనల్ కంపనీ విషయంలో పూర్వ పరాలు పరిశీలించి.. నిర్ణయం తీసుకుంటాం అన్నారు.