కేటీఆర్, కవిత సిద్ధమా.? అభివృద్ధిపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా

ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దం.. కేటీఆర్, కవిత సిద్ధమా.? అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స‌వాల్ విసిరారు.

By Medi Samrat  Published on  6 Jan 2025 8:45 PM IST
కేటీఆర్, కవిత సిద్ధమా.? అభివృద్ధిపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా

ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దం.. కేటీఆర్, కవిత సిద్ధమా.? అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స‌వాల్ విసిరారు. ఆదిలాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తాన‌న్నారు. బీఆర్ఎస్‌లో కవిత వర్సెస్ కేటీఆర్ యుద్దం తారాస్థాయికి చేరిందన్నారు. సీఎం సీఎం అంటూ కవిత - కేటీఆర్ అనుచరులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.. కవిత - కేటీఆర్ ఇష్యూతో హరీష్ రావు పని గోవిందా అని ఎద్దేవా చేశారు. కవిత ఇప్పుడు వచ్చి బీసీల మీద కపట ప్రేమ ఒలకబోస్తుంది.. రెస్ట్ తీసుకునే కేసీఆర్ కు ప్రతి పక్ష హోదా ఎందుకు.? కేటీఆర్ అని ప్ర‌శ్నించారు. హరీష్ రావు తన దారి తాను చూసుకోవడం బెటర్ అని సూచ‌న చేశారు.

అధికారం తప్ప కేసీఆర్ కుటుంబానికి ప్రజల బాగోగుల గురించి పట్టవా అని మండిప‌డ్డారు. ఈ-కార్ రేస్ స్కాం లొట్టపీసు కేసు అయితే కేటీఆర్‌కు భయం ఎందుకు అని ప్ర‌శ్నించారు. తప్పు చేసిన వారే కేసులకు భయపడతారన్నారు. లాయర్లను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతా అని చిన్న పిల్లాడిలా అనడం హాస్యాస్పదం అన్నారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ లో ఇసుమంతైనా అహంకారం తగ్గలేదు.. కార్ రేసింగ్ డబ్బుల నిధుల మళ్ళింపుపై మాట ఎందుకు మార్చావు.. కోర్టులో పిటిషన్ ఎందుకు దాఖాలు చేశావు అని కేటీఆర్‌కు ప్ర‌శ్న‌లు సంధించారు.

మతం పేరిట రాజకీయం చేయడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం కోసం ఆ పార్టీలో కోల్డ్ వార్ జ‌రుగుతుంద‌ని.. పార్టీలో పట్టుకోసం పాత - కొత్త నేతల ఆరాటం తప్ప ఒరిగేది ఏమీ లేదన్నారు.

Next Story