హైదరాబాద్: ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితర నేతలు హాజరయ్యారు. అనంతరం పీఏసీ సమావేశంపై ప్రకటన చేశారు.
కాగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్‌లో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉండనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా నాయకులు చర్చించారు.