దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని టీపీసీసీ క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పునాదులపై, రాజ్యాంగ బద్దంగా దేశాన్ని నిర్మించిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. సెప్టెంబర్ 7 నుంచి 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 11 రోజులు చేస్తారని వెల్లడించారు. ఈ దేశాన్ని బీజేపీ మత, కుల పరంగా విభజించిందని విమర్శించారు. దేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని ఫైర్ అయ్యారు. ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.