కులగణన క్రెడిట్ రాహుల్‌గాంధీదే: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు.
By Knakam Karthik
కులగణన క్రెడిట్ రాహుల్‌గాంధీదే: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఏప్రిల్ 8న ఉభయసభల్లో ప్రవేశపెట్టిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్, గౌడ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు , కేశవరావు , మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ చైర్మన్ లు ,ఇతర ముఖ్య నేతలు ధన్యవాదాలు తెలిపారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సీఎం రేవంత్ సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాం. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో తెలంగాణ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపించడంతో తెలంగాణ బీసీ మంత్రులు, నేతలతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ధన్యావాదాలు తెలిపాం. కులగణన క్రెడిట్ రాహుల్‌గాంధీదే. కేంద్ర జనగణనతో పాటు కులగణన నిర్ణయం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వ విజయం. తెలంగాణ మోడల్‌ను కేంద్రంలోని బీజేపి అనుసరిస్తోంది. కులగణనపై కేంద్రం నిర్ణయంతో రాహుల్‌గాంధీ ఆశయం నెరవేరింది. రాహుల్‌గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించింది..అని టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.