ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ఎంతో పని చేశాం. గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం బాగా జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. సర్వేలు చేస్తున్నాం, ఎవరు ముందుంటే వారికీ సీటు. గెలిచే వారికి సీటు ఇస్తాం. జూబ్లీహిల్స్‌లో సామాజికవర్గం కాకుండా గెలుపు లక్ష్యం. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం.
మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ అధ్యక్షతన తెలంగాణ డీసీసీల అంశంపై సమావేశం ఉంది. కొత్తగా ఏఐసిసి ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు సమావేశానికి హాజరవుతారు. అక్టోబర్ 4 వతేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారు..అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.