హైదరాబాద్: ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి పని చేస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు, ప్రధానంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదలతో చాలా కష్టపడుతున్నారు. వారికి సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పడిక్కడ ముందుకు వచ్చి మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. సహాయక చర్యలలో ప్రభుత్వ సిబ్బందికి అండగా నిలవండి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజలను వరద బాధితులను ఆదుకోండి. ముంపునకు గురైన ప్రాంతాలలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, హైడ్రా తదితర శాఖలు చేస్తున్న సేవలకు మీ వంతు బాధ్యతగా సహకారం అందించాలి. ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటే మంచినీరు, పాలు, ఆహార పదార్థాలు అందించండి..అని టీపీసీసీ చీఫ్ తెలిపారు.