బీఆర్ఎస్‌ పరిపాలనను పక్కకు తోసి కవిత రక్షణ సమితి(కేఆర్ఎస్)గా మారింది

TPCC Campaign Committee Chairman Madhu Yashki Goud criticizes BRS. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటు చేసిందని

By Medi Samrat  Published on  21 March 2023 5:24 PM IST
బీఆర్ఎస్‌ పరిపాలనను పక్కకు తోసి కవిత రక్షణ సమితి(కేఆర్ఎస్)గా మారింది

TPCC Campaign Committee Chairman Madhu Yashki Goud criticizes BRS


60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటు చేసిందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల‌ను సోనియా గాంధీ సాకారం చేసింది. రాజకీయంగా నష్ట పోతాం అని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్ప‌డ్డాక అధికారంలోకి వ‌చ్చిన కల్వకుంట్ల కుటుంబం ఇసుక నుంచి మద్యం మాఫియాలో వేల కోట్లు మిగుల్చుకుందని ఆరోపించారు. బతుకమ్మ పేరుతో బ్రతక నేర్చిన కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల గడించింద‌ని విమ‌ర్శించారు. ఫ్లైట్ టికెట్ కొనలేని స్థితి నుంచి.. నేడు కల్వకుంట్ల కుటుంబం ప్రత్యేక ఫ్లైట్ లో చక్కర్లు కొడుతున్నారు.. ప్రజలు గమనించాలని కోరారు.

టానిక్ అనే పేరుతో చెట్ల సంతోష్ మద్యం తాగిస్తున్నాడని ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో ప్రారంభం అయిన కవిత మద్యం వ్యాపారం ఢిల్లీ వరకూ విస్తరించింది. తొమ్మిది ఏళ్లలో బీఆర్ఎస్‌ ఎంపీలు ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారా అని మధు యాష్కీ ప్ర‌శ్నించారు. ఏ తప్పూ చేయనపుడు సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్లారు? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? అని ఎమ్మెల్సీ క‌విత‌ను ఉద్దేశించి ప్ర‌శ్నలు సంధించారు.

బీఆర్ఎస్‌ పార్టీ పరిపాలనను పక్కకు తోసి (కేఆర్ఎస్) కవిత రక్షణ సమితిగా మారిందని విమ‌ర్శించారు. కవితకు రక్షణగా ఢిల్లీలో మంత్రులు వలయంగా మారారని ఆరోపించారు. గవర్నర్ పై పాడి కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహిళగా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేద‌ని అడిగారు. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్‌ పార్టీ లబ్ధి దారుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. మాస్టర్ మైండ్ కింగ్ క్వీన్ కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్సీ కవితకు ఖరీదైన వాచ్‌లు, విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో మద్యం సరఫరాపై కూడా ఈడీ, సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.


బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేన‌ని ఆరోపించారు. ఆదానీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చదానికే.. లిక్కర్ స్కాం తెర మీదకు తెచ్చారని అన్నారు. లండన్ లో రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత దేశంలో ఉన్న పరిస్థితుల గురుంచి మాట్లాడారే తప్ప దేశాన్ని కించపరిచేలా మాట్లాడలేదని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెట్టాలని మధు యాష్కీ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.


Next Story